తన నటన నచ్చలేదని చెప్పిన తమన్నా!
on Aug 1, 2023

ఇప్పుడున్న పరిస్థితుల్లో దళపతి విజయ్‌ని ప్రసన్నం చేసుకునే పనిలోనే ఉంటారు నాయికలు. అయితే తమన్నా మాత్రం ఏటికి ఎదురీదినట్టు చేశారు. దళపతి విజయ్‌తో నటించిన సినిమా తనకు నచ్చలేదని అన్నారు. విజయ్ సినిమాలో చేసిన తరహా నటనను ఎప్పుడూ రిపీట్ చేయకూడదని అనుకుంటున్నట్టు తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఆ సినిమా ఆడదని తెలిసినప్పటికీ, చేయాల్సి వచ్చిందని చెప్పారు. సురా సినిమా విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అని అన్నారు మిల్కీబ్యూటీ. తమన్నా భాటియా సురాలో తన నటన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ``నాకు ఆ సినిమా అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. కానీ కొన్ని సన్నివేశాలు అందులో చాలా దారుణంగా ఉంటాయి. అంటే సీన్లు బాగా లేవని కాదు. అందులో నా నటన అసలు బాలేదని. ఇప్పుడు ఆ సీన్లు చూసినా `ఇదేంటి ఇలా చేశాను ` అని అనిపిస్తుంది`` అని అన్నారు.
మరి సినిమా చేసేటప్పుడు ఆ విషయం అర్థం కాలేదా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు మిల్కీబ్యూటీ. ``షూటింగ్ సమయంలోనే నాకు అర్థమైంది. ఈ సినిమా ఆడదు అని నాకు అప్పుడే అనిపించింది. ఆ సినిమాకే కాదు. చాలా సినిమాలకు నాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ, ఒక్క సారి మూవీకి సంతకం చేశాక, మధ్యలో ఆపలేం. సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ, ప్రాజెక్టును మధ్యలో ఆపలేం. కథను, టెక్నీషియన్లను నమ్మి ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాను మధ్యలోనే వదిలేయలేం. బాధ్యతగా వ్యవహరించి తీరాల్సిందే`` అని చెప్పారు. ఎస్.పి.రాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన సినిమా సురా. విజయ్ టైటిల్ రోల్ చేశారు. విజయ్ నటించిన 50వ సినిమా ఇది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



